కూతురికి స్పెషల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సూపర్‌ స్టార్‌!

 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా  దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి  కాంబో లో భారీ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా దీనిని పాన్ వరల్డ్ లెవెల్లోతెరకెక్కించేందుకు చిత్ర బృందం సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ భారీ చిత్రం మొదలు పెట్టే ముందు వచ్చిన గ్యాప్ ని మహేష్‌ బాగా వినియోగించుకుంటున్నారు.

 ఈ సినిమా కోసం తనని తాను ప్రిపేర్ చేసుకుంటూనే ఉన్న సమయాన్ని కుటుంబంతో కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే  నేడు తన గారాల పట్టి ఘట్టమనేని సితార పుట్టినరోజు రావడంతో మహేష్ సోషల్ మీడియాలో తన స్పెషల్ విషెస్ ని సితారకు అందించాడు. సితార సెల్ఫీ పిక్ ని పోస్ట్ చేసి హ్యాపీ 12 నా ముద్దుల చిట్టి తల్లి, ఒక స్టార్ లా ఎప్పటికీ షైన్ అవుతునే ఉండు.. ఈ స్పెషల్ డే నీకు మరింత స్పెషల్ డే గా మారాలి. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ స్పెషల్‌ విషెస్ ని మహేష్ బాబు తెలియజేశాడు.

 దీంతో ఈ స్పెషల్ పోస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాతో పాటు..అటు సూపర్‌ స్టార్‌ అభిమానుల్లో కూడా వైరల్ గా మారింది. అలాగే అభిమానులు కూడా సితారకి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories