టాలీవుడ్ భామ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా తక్కువ సమయంలోనే ఈ భామ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సొంతం చేసుకుంది. దాదాపు స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. కానీ మ్యారేజ్ విషయంలోనే కాస్త సోషల్ మీడియాలో నెగిటివ్ మార్క్ మూట గట్టుకుంది. కొద్ది రోజుల అనంతరం మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. అవన్నీ అధిగమించి సామ్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి మొన్న సమంత బర్త్ డే నాడు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. రెడ్ శారీ కట్టుకుని.. చేతిలో తుపాకీ పట్టుకుని వీరనారి గెటప్‌లో సామ్ దర్శనమివ్వడంతో ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా పునకాలొచ్చాయి. ఇదిలా ఉంటే సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఫ్యాన్స్‌కు భారీ గుడ్‌న్యూస్‌గా మారింది. సాకీ పేరుతో సమంత గార్మెంట్ బ్రాండ్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
కాగా ఈ కంపెనీలో పని చేసేందుకు సామ్ ఉద్యోగ ప్రకటన చేసింది. తగు అర్హతలు ఉన్నవారు కింద ఇచ్చిన మెయిల్ అడ్రస్‌కు వివరాలు పంపాలని సామ్ తెలిపింది. కాగా ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ తో పాటు మరో రెండు పొజిషన్స్ కూడా ఉన్నాయని సామ్ వెల్లడించింది. ఇక ఈ వార్త విన్న సమంత ఫ్యాన్స్ ఎగిరిగంతులెస్తున్నారు. ఇక ఆలస్యమెందుకు ఈ గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకోకుండా మీరు కూడా అప్లై చేసుకోండి.