రోడ్డు పై ఆగిపోయిన కారును తోసిన స్టార్‌ డైరెక్టర్‌!

తెలుగు స్టార్‌ డైరెక్టర్ హరీష్‌ శంకర్ గురించి ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేదు. గబ్బర్‌ సింగ్‌ లాంటి సూపర్‌ హిట్‌ సినిమాని తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చిన గ్రేట్ డైరెక్టర్‌.. ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ పవన్‌ కల్యాణ్‌ తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కొంచెం ఆలస్యం కావడంతో ప్రస్తుతం ఆయన మిస్టర్ బచ్చన్‌ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ ఎలక్షన్స్‌ బిజీ ఉండడంతో సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. ఈ గ్యాప్‌ లో హరీష్‌ రవితేజతో సినిమా చేస్తున్నారు. మిస్టర్‌ బచ్చన్‌ టైటిల్‌ తో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఇంతకు ముందు కూడా హరీశ్‌ శంకర్‌- రవితేజ కాంబోలో మిరపకాయ్ సినిమా వచ్చి సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే.దాంతో మిస్టర్ బచ్చన్‌ సినిమా పై కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా హరీష్‌ శంకర్‌ రోడ్డు పై  కారును తోస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

రోడ్డు పై ఆగిపోయిన కారును హరీష్‌ శంకర్‌ తో పాటు మరికొందరు కలిసి నెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ గా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories