పెద్దిరెడ్డి మిథున్ అరెస్టుకు రంగం సిద్ధం!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో.. విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ కేవలం ఒక్క లిక్కర్ దందా రూపంలోనే దాదాపు 30 వేల కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు సాగించారని, అవినీతి సొమ్ము కాజేశారని ఆరోపణలున్నాయి. ఈ మొత్తం లిక్కర్ దందాకు కీలక సూత్రధారిగా వ్యవహరిస్తూ.. జగనన్న కోటరీలో కీలకవ్యక్తిగా మెదలినది రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డే నని కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో.. పోలీసులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఆయన అరెస్టు ఉంటుందని అంటున్నారు. పెద్దిరెడ్డి ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఆయనకు గతంలో  హైకోర్టు అరెస్టు నుంచి కల్పించిన రక్షణ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన అరెస్టు జరుగుతుందని, విచారణకు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

జగన్ హయాంలో సరికొత్త లిక్కర్ పాలసీ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఎవ్వరి ఊహలకు కూడా అందని విధంగా ఏపీలో లిక్కర్ దందాను విచ్చవిడిగా సాగించారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నట్టుగా కొత్త పాలసీని రూపొందించి.. ప్రభుత్వ దుకాణాలనుంచే నేరుగా తయారీ కంపెనీలకు ఇండెంట్లు పెట్టారు. మద్యం తయారీ కంపెనీలను అడ్డంగా తమ చేజిక్కించుకున్నారు. బినామీ పేర్లతో తమ పరం చేసుకుని దందా నడిపించారు. అలాగే.. మద్యం ధరలను విపరీతంగా పెంచేసి.. ఆ మొత్తం  తమకు అడ్డడారుల్లో లంచాలుగా సమర్పించే కంపెనీలకు మాత్రమే.. ఇండెంట్లు పెడుతూ, మిగిలిన వారిని పక్కన పెడుతూ రోజూవారీ వసూళ్లతో వేలాది కోట్ల రూపాయల దందా నడిపించారు. ఈ మొత్తం మద్యం దందాకు రాజ్ కసిరెడ్డి నేతృత్వం వహించగా, తెరవెనుక సూత్రధారిగా ప్రధాన పాత్ర ఎంపీ మిథున్ రెడ్డితే అని ఆరోపణలు వచ్చాయి. ఒక నిందితుడు విచారణలో తన పేరు చెప్పినందుకే మిథున్ తీవ్ర ఆందోళన చెందారు. ఆయన పేరును నిందితుల జాబితాలో చేర్చకపోయినప్పటికీ, ఆయనకు విచారణ నిమిత్తం నోటీసులు ఇవ్వకపోయినప్పటికీ తనకు ముందస్తు బెయిలు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. తన తండ్రికి చేయి విరిగి గాయమైతే, పరామర్శకు వచ్చినా సరే తనను పోలీసులు అరెస్టు చేసేస్తారంటూ కోర్టుకు నివేదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని హైకోర్టు తీర్పు చెప్పింది. ముందస్తు బెయిలు పిటిషనుపై తుదితీర్పును అదే తేదీకి వాయిదా వేసింది. తాజాగా గురువారం నాడు.. ముందస్తు బెయిలును తిరస్కరిస్తూ తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో మిథున్ భయపడుతున్నట్టే జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. ముందుగా పోలీసులు ఆయనకు విచారణ నిమిత్తం నోటీసులు ఇస్తారని, ఆ తర్వాత ఆయన అరెస్టు కూడా జరుగుతుందని అంచనాలు సాగుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories