స్పిరిట్‌ ఇప్పట్లో లేనట్లేనా!

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సలార్‌ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.  ప్రస్తుతం ప్రభాస్‌ యంగ్‌ డైరెక్టర్‌ మారుతీ డైరెక్షన్‌ లో కల్కి అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే మరికొన్ని సినిమాలను కూడా ఆఫర్‌ లో పెట్టుకున్నాడు. అందులో ముఖ్యంగా యానిమల్‌ డైరెక్టర్‌ సందీప్‌ వంగా తో ఓ సినిమా ఉంది.

సందీప్‌ వంగా కొంత కాలం క్రితం బాలీవుడ్‌ లో యానిమల్‌ సినిమాతో బిగ్గెస్ట్‌ హిట్‌ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరి కాంబో అంటే అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే సందీప్‌ వంగా సినిమాలు ఎలా ఉంటాయో అర్జున్‌ రెడ్డి అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం.

అలాంటిది ఇప్పుడు సందీప్‌ వంగా, ప్రభాస్‌ కాంబో సినిమా అంటే ఎలా ఉంటుంది అనే సందేహాలు అధికం అయ్యాయి. వీరి చిత్రానికి స్పిరిట్‌ అనే పేరు కూడా పెట్టినట్లు సమాచారం. ఈ సినిమా ని ఈ సంవత్సరం చివరినాటికి సెట్స్‌ మీదకు తీసుకుని వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సందీప్ వంగా తెలిపారు.

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ ఇంకా పూర్తి కాలేదని.. దానికి ఇంకా 4 నుంచి 5 నెలల సమయం వరకు పట్టవచ్చని టాక్‌. ఆ తరువాత సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభం అవుతాయని ..ఈ సినిమా  2025 లో షూటింగ్‌ జరుపుకుంటుందని తెలుస్తుంది.

ఈ విషయం అభిమానులకు నిరాశ కలిగించే విషయమే… కానీ వీరిద్దరి కాంబో కోసం మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ పవర్‌ ఫుల్‌ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories