షూటింగ్ అన్న అవ్వలేదు.. అప్పుడే అన్ని కోట్ల బిజినెస్సా?

టాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి చాలా గ్యాప్‌ తరువాత తెలుగులో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు క్రిష్‌ డైరెక్షన్‌ లో ఓ సోషల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఘాటీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి సంబంధించిన అమెజాన్‌ ప్రైమ్‌ ఈవెంట్ లో మూవీ ప్రీ లుక్‌ లాంఛ్‌ చేశారు. ఈ లుక్‌ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త అందరికి షాక్‌ ఇస్తుంది. సమాచారం ప్రకారం ఘాటీ రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసిందని వినిపిస్తుంది. ఈ సినిమా కథ ప్రకారం.. నేరస్థురాలిగా మారిన ఓ యువతి ప్రతీకారం ఎలా తీర్చుకుంది అనే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

ఇంకా సినిమా షూటింగ్‌ కూడా పూర్తి కాకముందే ప్రీ, పోస్ట్‌ రిలీజ్‌ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. దీంతో సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో పోస్ట్‌ థ్రియాట్రికల్ రిలీజ్‌ కానుందని సమాచారం. అరుంధతి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోలకే పోటీగా నిలిచింది. బాహుబలిలో దేవసేనగా మెరిసి ఇండస్ట్రీ క్వీన్ గా నిలిచింది.

Related Posts

Comments

spot_img

Recent Stories