నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఆయన నటిస్తున్న చిత్రాలతో ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు ఈ హీరో. ఇక నాని ప్రస్తుతం ‘హిట్-3’ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో రూపొందిస్తున్నాడు. అయితే, నాని తన గతకొన్ని చిత్రాలలో ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు.
ఇక ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాల విషయంలోనూ ఈ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘దసరా’ మూవీ 2023 మార్చి 30న గురువారం రోజు రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ మూవీ 2023 డిసెంబర్ 7న గురువారం రోజున.. ‘సరిపోదా శనివారం’ 2024 ఆగస్టు 29న గురువారం రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ‘హిట్-3’ మూవీని 2025 మే 1న గురువారం.. ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని 2026 మార్చి 26న గురువారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.