ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కొత్త హామీలు ఇవ్వకుండానే ప్రజల ఎదుటకు వెళ్లారు. ప్రతి ఇంటికి ప్రతి నెల తాను డబ్బులు పంచి పెడుతున్నాను గనుక.. రాష్ట్రంలోని ఒక్కొక్క ఇంటికి ఐదేళ్ల పదవీకాలంలో ఎన్ని వేల లక్షల రూపాయలు పంచిపెట్టారో నివేదికల రూపంలో వారందరికీ పదేపదే తెలియజేశారు గనుక.. వాళ్ళందరూ తనకు రుణపడి ఓట్లు వేస్తారని నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి దారుణంగా విఫలమయ్యారు. ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని సమ్మిళితంగా దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీలు ఇస్తే.. అవన్నీ ఆచరణ సాధ్యం కానీ హామీలు అంటూ.. చంద్రబాబు నాయుడు కు మాట నిలబెట్టుకునే అలవాటు లేదంటూ.. జగన్మోహన్ రెడ్డి ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారు. తీరా ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ హామీలు ఎందుకు ఇవ్వలేదో ఇన్ డైరెక్ట్ గా సాక్షి దినపత్రిక బయట పెడుతుంది.
జగన్మోహన్ రెడ్డి కి చెందిన ఈ కరపత్రికలో అడ్డగోలుగా చంద్రబాబునాయుడు సర్కారు మీద విషం కక్కుతూ ఉంటారని అందరికీ తెలుసు. ఆ పత్రికలో ఒక కాలమిస్టు తాజాగా ఏం చెబుతున్నారంటే.. జగన్ సర్కారు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని చంద్రబాబు నాయుడు మరియు ప్రతిపక్షాలు గతంలో ఆరోపించాయట. ఆ స్థాయిలో అప్పులు చేసిన మాట నిజమే అయితే కనుక ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. దానికి తగ్గట్లుగా ఆచరణలో చేయగలిగిన హామీలను మాత్రమే ఇవ్వాలి. అలా కాకుండా తెలుగుదేశం, జనసేన ఆకాశమే హద్దుగా ఎన్నికల వరాలు కురిపించాయని ఆయన ఎద్దేవా చేస్తున్నారు.
సదరు కరపత్రిక కథనం ప్రకారం జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను చూసి భయపడి తెలుగుదేశం ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా ఊరుకోవాలన్నమాట. కొత్తగా అధికారంలోకి రాదలుచుకున్న పార్టీ ప్రజలకు ఎలాంటి వరాలు ఇవ్వకూడదన్నమాట. చూడబోతే ప్రత్యర్థులు ఎలాంటి కొత్త హామీలు ప్రజలకు ఇవ్వకుండా ఉండేందుకే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశాడేమో అనిపిస్తుంది. సదరు కర పత్రిక కాలమిస్ట్ గారు సెలవిచ్చినట్లుగా.. అన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు గనుకనే కొత్త హామీలు ఇవ్వడానికి జగన్ సంకోచించారని కూడా అర్థం అవుతుంది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు డబ్బులు పంచిపెట్టడానికి ప్రారంభించిన సంక్షేమ పథకాలు చాలు అనుకొని.. జగన్ కొత్త హామీలు ఇవ్వలేదేమో అని ప్రజలు ఇప్పటిదాకా అనుకున్నారు. అయితే సాక్షి పత్రిక వెల్లడిస్తున్న వాస్తవాలను గమనించిన తర్వాత.. తాను చేసిన అప్పులకు తానే భయపడి కొత్త హామీలు ఇవ్వడానికి జగన్ ఆలోచించారని అర్థమవుతుంది.
చంద్రబాబు నాయుడు తాను సంపద సృష్టిస్తానని చెప్పిన మాట వాస్తవం. ఒక వైపు రుణాలు తీసుకువస్తూ మరోవైపు సంపద సృష్టి కూడా తెలిసిన నాయకుడు కనుకనే.. అభివృద్ధి అంటే ఏమిటో తెలిసిన నాయకుడు కనుకనే పంచాయితీలకు 1000 కోట్ల రూపాయల వరకు విడుదల చేసి వాటిని అభివృద్ధి దిశగా పరిపుష్టం చేస్తున్నారని వాటితో పాటు సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం కంటే మెరుగైన రీతిలో అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు అని ప్రజలు అంటున్నారు. విద్యార్థుల తల్లులకు డబ్బు విడుదల చేయడం వంటి పథకాలకు ప్రభుత్వం సమయం తీసుకుంటుండగా ఈలోగా ఆ అంశాలపై ప్రభుత్వాన్ని భ్రష్ట పట్టించాలని జగన్ కరపత్రిక శతవిధాల ప్రయత్నిస్తున్న వైనం నవ్వుల పాలవుతోంది.