జక్కన్న రెండో వెర్షన్‌ ఎప్పుడూ!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తీర్చిదిద్దిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ చిత్రం విడుదలై మార్చి 25కి రెండు సంవత్సరాలు గడిచాయి. దీంతో చిత్ర యూనిట్‌ మొత్తం సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల సమయంలో రాజమౌళి చెప్పిన ఓ విషయం మరోసారి అభిమానులు గుర్తుకు తెచ్చుకున్నారు.

అది ఏంటంటే.. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తీసిన సమయంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సెకండ్‌ వెర్షన్‌ కూడా ఉంటుందని తెలిపారు. సినిమా వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఆర్‌ఆర్‌ఆర్‌ సెకండ్‌ వెర్షన్‌ గురించి చిత్ర బృందం మాత్రం దీని గురించి మాట కూడా మాట్లాడట్లేదు. గతంలో సినిమా గురించి ప్రమోషన్స్‌ చేస్తున్న సమయంలో ఆర్‌ఆర్‌ఆర్‌ కి ఫన్‌ వెర్షన్‌ కూడా ఉందని చెప్పుకొచ్చారు.

ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఆ వెర్షన్‌ కూడా షూట్‌ చేశామని వివరించారు. ఆ సెకండ్‌ వెర్షన్‌ చాలా ఫన్నీగా ఉంటుందని చెప్పుకొచ్చింది చిత్ర బృందం. సినిమా వచ్చి రెడేళ్లు అయినా ఇంకా ఫన్ వెర్షన్‌ రాలేదని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరీ దీనికి సమాధానంగా జకన్న బృందం ఏమని చెబుతుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories