లిక్కర్ లోనే కాదు క్వార్ట్జ్ లో కూడా అదే దందా!

లిక్కర్ కుంభకోణం విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక గొప్ప విధానం కనుగొంది. అక్రమ వసూళ్లు చేయడానికి ఒక పెద్ద నెట్వర్క్ ను ఏర్పాటు చేసి, వారి ద్వారా వసూళ్లు సాగిస్తూ, రెండో కంటికి తెలియకుండా బిగ్ బాస్ గా వ్యవహరించే ముఖ్యనేతకు అంతిమలబ్ది చేకూరేలాగా ఈ వ్యవహారం నడిపించారు. సక్సెస్ ఫుల్ ఫార్ములా కావడంతో ఇదే ఫార్ములాను ఇంకా అనేక దందాలకు కూడా విస్తరించినట్లుగా నెమ్మది నెమ్మదిగా అర్థమవుతోంది. నెల్లూరు జిల్లా క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల దందాలో ముఖ్యనేతకు కూడా పాత్ర ఉన్నదని, ఆయనకు నెలవారీగా వాటాల వంతున దాదాపుగా 9 నెలల్లో 180 కోట్ల నగదు చేరిందని ఇప్పుడు విచారణలో తెలుస్తోంది.
నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్  అక్రమ తవ్వకాల వ్యవహారం దర్యాప్తు జరుగుతున్నకొద్దీ రోజురోజుకు దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత కాకాని గోవర్ధన రెడ్డి పాల్పడిన పాపం కింద కేసులు నమోదు అయ్యాయి. ఆయన ఒక్కడే మూలవిరాట్టు అని అందరూ అనుకున్నారు. ఆయన సుదీర్ఘకాలం పరారీలోకి వెళ్లి చివరికి పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డిని విచారించిన తర్వాత కొన్ని అదనపు వివరాలు రాబట్టారు. దరిమిలా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ని హైదరాబాదులో అరెస్టు చేశారు. ఆయన నెల్లూరు జిల్లాకే చెందిన మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు కీలక అనుసరుడు. ఈ క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల దందాను నడిపించడంలో కీలక పాత్రధారి.

ఇద్దరు మంత్రుల అండతో క్వార్జ్ అక్రమ తవ్వకాలు, అమ్మకాలు, వసూళ్లు దందా మొత్తం శ్రీకాంత్ రెడ్డి నడిపినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయనను అరెస్టు చేసి విచారించిన తరువాత తెలిసి వచ్చిన వివరాలను బట్టి అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా కేసు నమోదు అయింది. అయితే ఈ వ్యవహారంలో ఇంకా గొప్ప ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి.

నెల్లూరు జిల్లాలో సాగించిన క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ తవ్వకాల దందాలలో గణనీయమైన వాటాలు ముఖ్య నేత బిగ్ బాస్ కు కూడా అందినట్లుగా వార్తలు వస్తున్నాయి. పోలీసుల విచారణలో ఇందుకు సంబంధించిన ఆధారాలు అన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ సారధ్యంలోనే దందా మొత్తం చేశామని వసూళ్లు చేసిన సొమ్ములో నెలకు కనీసం 20 కోట్ల వంతున ముఖ్య నేతకు చేరవేశామని శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. అనిల్ కుమార్ ను కూడా అరెస్టు చేసి కస్టడీలో విచారిస్తే ఈ అవినీతి అక్రమాల బాగోతానికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలు వెలుగులోకి వస్తాయని అందరూ అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories