టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ రిలీజ్ కి వస్తుండగా ఈ మధ్యలో తాను స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ కి పాల్గొనడం జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో పహాల్గమ్ దుర్ఘటనపై విజయ్ చేసిన ఎమోషనల్ కామెంట్లు కొన్ని వివాదాల వరకు వెళ్లాయి. అయితే ఈ వివాదంపై విజయ్ ఇపుడు క్లారిటీ ఇచ్చాడు.
తాను ఎక్కడా కూడా ఏ కుల ప్రస్తావన కూడా తీసుకు రాలేదని తేల్చి చెప్పాడు. తాను చేసింది కేవలం ఒకప్పటి వారి ఐకమత్యం గురించి అని తెలిపాడు. తాను మొత్తంగా చెప్పాలి అనుకున్నది కేవలం శాంతి, ఐకమత్యం కోసమే అని ఈ మాటల్లో తన వల్ల ఎవరైనా బాధించి ఉంటే అందుకు క్షమాపణలు తెలుపుతున్నాని అని విజయ్ ఓ ప్రెస్ నోట్ ద్వారా రివీల్ చేసాడు. దీంతో తన కామెంట్స్ వైరల్ గా మారాయి.