గేమ్ ఛేంజర్ విడుదలకు రూట్ క్లియర్ అయినట్లే! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న గ్రాండ్ విడుదలకు సిద్దమైంది. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే, తమిళ్‌లో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయని తమిళ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా విడుదల పై అయోమయం క్రియేట్ అయ్యింది. లైకా ప్రొడక్షన్స్ డైరెక్టర్ శంకర్ తమతో ‘ఇండియన్-3’ సినిమా చేస్తాడని.. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ను తమిళనాట విడుదల చేస్తున్నాడని…ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని లైకా ప్రొడక్షన్స్ తమిళ నిర్మాతల కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
కానీ, ఇప్పుడు అవేవీ కూడా నిజం కాదని తెలుస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ విడుదల అందరూ అనుకుంటున్నట్లుగా సజావుగా సాగనుందని తమిళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ క్లారిటీ ఇచ్చారు.