రెట్రో క్రేజ్ మామూలుగా లేదుగా!

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేయగా పూర్తి లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఇది రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాపై ఓవర్సీస్‌లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. యూకే లో ఈ చిత్రం సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునేందుకు సిద్ధమైంది. అక్కడ ఈ చిత్ర డే 1 కోసం ఏకంగా 5800 కి పైగా టికెట్స్ అమ్ముడైనట్లు మేకర్స్ తెలిపారు.

దీంతో తొలిరోజు ‘రెట్రో’ యూకే కలెక్షన్స్ ఎలా ఉండబోతాయా అనే ఆసక్తి మొదలైంది. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories