రెస్పాన్స్ బాగుంది! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న తాజా సినిమాల్లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ, క్రిష్ కలయికలో చేసిన భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఓ సినిమా. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి ఎట్టకేలకి మళ్ళీ అప్డేట్స్ మొదలయ్యాయి ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా అది కూడా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా భాషల్లో ఆలపించిన సాంగ్ ‘మాట వినాలి’ ని మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. అయితే ఈ పాట కి ఇపుడు మన తెలుగులో ఆల్ టైం హైయెస్ట్ రికార్డు వ్యూస్ వచ్చి పడ్డాయి. టాలీవుడ్ లో ఇది వరకు వచ్చిన సినిమాల అన్ని ఫస్ట్ సింగిల్స్ కంటే అత్యధిక వ్యూస్ 19 మిలియన్ కి పైగా అందుకుంది. దీంతో పవర్ స్టార్ ఛార్జ్ మళ్ళీ మొదలైంది అని చెప్పుకోవాలి. ఇక ఇదే 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చినట్టుగా మేకర్స్ ప్రకటించారు.