విడుదల తేదీ వచ్చేసింది!

విడుదల తేదీ వచ్చేసింది! టాలీవుడ్ మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “కుబేర”. టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ లో అక్కినేని నాగార్జున ఒక సాలిడ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ తో మంచి బజ్ ని అందుకుంది. 

అయితే ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకి మేకర్స్ ఇపుడు ఫైనల్ గా ఒక అఫీషియల్ డేట్ ని అయితే ఇచ్చేసారు. దీనితో ఇది వరకు చెప్పినట్టుగానే కుబేర చిత్రం ఈ జూన్ 20న రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో మేకర్స్ రివీల్ చేశారు. మరి ఇందులో నాగార్జున, ధనుష్ లు ఎదురెదురుగా చూసుకుంటుండగా వారి చుట్టూ నగరం, బస్తీ ఇల్లు కనిపిస్తున్నాయి. ఇక మధ్యలో బాలీవుడ్ నటుడు జిమ్ షర్బ్ కనిపిస్తున్నారు. 

ఇలా మొత్తానికి అయితే మేకర్స్ ఫైనల్ గా అవైటెడ్ డేట్ ని రివీల్ చేశారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు, ఆసియన్ సునైల్ లు నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories