పిల్లింగ్స్‌ పాట విడుదల తేదీ వచ్చేసింది!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న వన్ అండ్ ఓన్లీ పెద్ద మూవీ ఏదన్నాఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్‌  రష్మిక కాంబోలో, టాలెంటెడ్‌ డైరెక్టర్  సుకుమార్ తెరకెక్కించిన మాసివ్ సినిమా “పుష్ప 2 ది రూల్” అనే చెప్పుకోవాలి.

మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఒక్కో పాట సాంగ్ ఒక దానిని మించి మరొకటి హిట్ కాగా రీసెంట్ గా అయితే ఈ సినిమా నుంచి నాలుగో సాంగ్ క్రేజీ రెస్పాన్స్ ని సంపాదించుకుంది. మలయాళ ఈవెంట్ కార్యక్రమంలో ప్రకటించిన ఆ పాటనే “పీలింగ్స్”.పక్కా మలయాళ బీట్స్ లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఈ సాంగ్ అక్కడే ఓ రేంజ్ లో జనానికి మంచి కిక్‌ ఇచ్చింది.

దీంతో ఈ సాంగ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకి ఇపుడు సాలిడ్ ప్రోమోతో తేదీ బయటకు వచ్చేసింది. దీంతో ఈ మోస్ట్‌ అవైటెడ్ సాంగ్ ఈ డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్టుగా చెప్పేశారు. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories