రెడ్లకు పెద్దపీట వేయడం మానలేదు!

ఎన్నికలలో ఘోరమైన పరాజయం ఎదురైన తర్వాత ఎవరైనా సరే అలాంటి పరాజయానికి కారణాలను అన్వేషించుకుంటారు. మెజారిటీ అభిప్రాయం తెలుసుకుంటారు ఏదైతే పరాజయ కారణాలుగా అందరూ ఒప్పుకుంటారో.. వాటిని దిద్దుకోవడం ఎలాగో విశ్లేషించుకుంటారు. అంతేతప్ప పరాజయానికి దారి తీసిన మార్గాలలోనే మళ్లీ అడుగులు వేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి రూటే సపరేటు! ఐదేళ్ల పరిపాలన కాలంలో రెడ్లకు మాత్రమే కీలక పదవులు కట్టబెడుతూ అన్ని అధికారాలు వాళ్ల చేతిలోనే పెట్టారనే విమర్శలను జగన్ ఎదుర్కొన్నారు. పార్టీ పునర్నిర్మాణం కోసం కొత్తగా ముగ్గురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను నియమించుకోగా,  ఆ ముగ్గురూ రెడ్డి సామాజిక వర్గానికి గా చెందినవారే కావడం విశేషం. జగన్ తీరు మారలేదని, రెడ్లకు మాత్రమే పెద్దపీటవేసే అలవాటును ఆయన మానుకోలేరని జనం అంటున్నారు.

ఏదైనా రాజకీయ పార్టీలో ఒక సామాజిక వర్గం పెత్తనం నడిచినప్పటికీ, అది అందరి పార్టీ అనే అభిప్రాయం కల్పించాలి. ఆ భావన ప్రజల్లో ఏర్పడకపోతే కొన్నాళ్లకు మనుగడ కష్టమవుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తొలినుంచి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనే పేరు ఉంది. దానికి తగ్గట్టుగానే ఐదేళ్ల పదవీకాలంలో ఆ సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించారు. పార్టీ మరింతగా అపకీర్తి పాలయ్యింది. ఓడిపోయింది కూడా.

ఇప్పుడైనా ఈ పార్టీ అందరి సొత్తు అనే అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించడానికి జగన్ ప్రయత్నించాలని పార్టీ నాయకుల అభిప్రాయం. జగన్ అలాంటి పని చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల బాధ్యతలను కొందరు పెద్ద నాయకులకు అప్పగించడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలోకి తీసుకుంటే.. ఆ ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. కడప జిల్లాకు చెందిన గడికోట శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దువ్వాడ శ్రీనివాస్ మీద వేటు వేయడం ఒక్కటే ఆయన తీసుకున్న సమయోచిత నిర్ణయం అని ప్రజలు అంటున్నారు. ఒకే కులం చేతుల్లో పెత్తనం పెట్టిన జగన్మోహన్ రెడ్డి అందరు ప్రజల మన్నన ఎలా పొందగలుగుతారో వేచి చూడాలి!

Related Posts

Comments

spot_img

Recent Stories