అసలు కారణమిదే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్‌ లోనే పేరున్న దర్శకుడు శంకర్ కాంబోలో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం భారీ హైప్ ని సెట్ చేసుకొని నిదానంగా ఒక్కో అప్డేట్  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఏ రేంజ్‌ లో ఎదురు చూస్తున్నారో తెలిసిన సంగతే. అయితే గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా విడుదల డిసెంబర్ నుంచి జనవరి సంక్రాంతికి షిఫ్ట్ అవుతుంది అని కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. థమన్ కానీ,  దిల్ రాజు కానీ క్రిస్మస్ రిలీజ్ అంటూ చెబుతున్నారు. అయితే వీళ్లు ఇలా చెబుతున్నప్పటికీ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి షిఫ్ట్ అయ్యేందుకు ఉన్న ఛాన్స్ ఉన్నట్లే తెలుస్తుంది.

మేకర్స్ సైడ్ నుంచి క్రిస్మస్ డేట్ ని అనుకునే తెలుగు స్టేట్స్ లో దాదాపు డిస్ట్రిబ్యూటర్లు సంక్రాంతికి అయితే బెటర్ అని భావిస్తున్నారంట. ఇందుకే ప్రస్తుతానికి గేమ్ ఛేంజర్ విడుదల తేదీ ఇరకాటంలో ఉంది. మేకర్స్ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ వస్తే తప్ప విడుదల ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories