పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’, ఫౌజీ చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాల తర్వాత ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ‘స్పిరిట్’ అనే సినిమాలో నటించనున్నాడు. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై నిర్మాత భూషణ్ కుమార్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముచ్చట వెల్లడైంది.
మరో 2-3 నెలల్లో స్పిరిట్ చిత్ర షూటింగ్ మొదలు అవుతుందని ఆయన తెలిపారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.