ఆ మాటలకు వివరణ ఇచ్చిన నిర్మాత! తమిళ నటుడు కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ చిత్ర తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత ఎస్‌కెఎన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. తెలుగు అమ్మాయిలతో పని చేస్తే ఫలితం ఎలా ఉంటుందో తమకు తెలిసొచ్చిందని.. ఆయన ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అన్నారు. దీంతో ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. ఎస్‌కెఎన్ ఇకపై తెలుగు అమ్మాయిలతో పనిచేయబోడని.. ఆయన వర్క్ చేసిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యపై నేరుగా ఆయన ఈ కామెంట్స్ చేశారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో తాజాగా ఆయన ఈ వార్తలపై తన క్లారిటీ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను పరిచయం చేసిన అతి తక్కువ మంది నిర్మాతల్లో తాను ఒకరని.. తాను పరిచయం చేసిన హీరోయిన్ల పేర్లను ప్రస్తావించారు. అంతేగాక, తన నెక్స్ట్ చిత్రాల హీరోయిన్లు కూడా తెలుగు వారే అని.. కేవలం హీరోయిన్లే కాకుండా ఇతర క్రాఫ్ట్‌లలో కూడా తెలుగు అమ్మాయిలకు తాను ప్రాధాన్యత ఇస్తానంటూ క్లారిటీ చేశారు. తాను సరదా కోసం చేసిన కామెంట్స్‌ను ఎలాంటి వివాదాలకు తావివ్వద్దు అని ఆయన కోరారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.