సైయారా ఓటీటీ ముహుర్తం కుదిరింది!

ఇటీవల బాలీవుడ్‌లో ప్రేక్షకుల మన్ననలు పొందిన సినిమాల జాబితాలో సైయారా అనే చిత్రం టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆహాన్ పాండే అనే యంగ్ హీరో ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ఎవ్వరూ ఊహించనంత స్థాయిలో ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు వరకు దాదాపు 400 కోట్లకుపైగా వసూళ్లను అందుకొని ఇంకా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది.

ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే భారీ క్రేజ్ నెలకొంది. డెబ్యూ హీరో సినిమా అయినప్పటికీ, మాస్ ఆడియెన్స్ నుంచీ కుటుంబ ప్రేక్షకుల వరకు అందరికీ బాగా కనెక్ట్ అయింది. ఈ నేపథ్యంలో సైయారా ఓటిటి స్ట్రీమింగ్ పై కూడా ఆసక్తికరమైన వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

వినిపిస్తున్న సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 12న ఈ చిత్రం ఓటిటిలోకి రాబోతోందన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది హిందీ వెర్షన్‌లో మాత్రమే స్ట్రీమింగ్‌కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఇదంతా అనధికారిక సమాచారం మాత్రమే. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ సినిమా థియేటర్లలో ఎంత సక్సెస్ అయినా, ఓటిటిలో ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఉత్కంఠతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories