ఏజ్‌ పెరిగినా.. అందం తగ్గని ఏకైక హీరో!

మహేష్‌ బాబు సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తరువాత మహేష్‌ బాబు రాజమౌళి సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి వెకేషన్‌ కి స్విట్జర్లాండ్‌ వెళ్లిపోయాడు. అక్కడ నుంచి మహేష్‌ తన ఫ్యామిలీ ఫోటోలు ఎప్పటికప్పుడూ అభిమానులు తో పంచుకుంటున్నాడు.

తాజాగా మహేష్‌ తన సోషల్‌ మీడియాలో కొత్త లుక్స్‌ తో కొత్త కొత్త ఫోటోలు షేర్‌ చేసుకున్నాడు. ఒట్టో క్లాతింగ్‌ బ్రాండ్‌ కి మహేష్‌ బ్రాండ్ అంబాసిడర్‌ అని తెలిసిందే. గతంలో కూడా ఈ బ్రాండ్‌ కోసం స్పెషల్‌ ఫోటో షూట్‌ చేసి ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ గా మారాయి. ఏజ్‌ పెరుగుతున్నప్పటికీ .. అందం తగ్గని ఏకైక హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది మహేష్‌ అనే చెప్పవచ్చు.

అటు అభిమానులు.. ఇటు నెటిజన్లు కూడా మహేష్‌ ని పొగుడుతున్నారు. ఇదే అవకాశమని మహేష్‌ కొత్త ఫోటోలను షేర్‌ చేస్తూ ఎస్‌ఎస్‌ ఎంబీ 29 హ్యాష్‌ ట్యాగ్‌ కూడా ఇస్తుండడంతో ప్రస్తుతం మహేష్‌ బాబు రాజమౌళి సినిమా కూడా ట్రెండింగ్‌ లో ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories