పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఓజి” పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
ఇక యూఎస్ మార్కెట్ లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. రిలీజ్ కి ఇంకా ఇరవై మూడు రోజులు ఉన్నా, ఇప్పటికే ఈ సినిమా ఒక మిలియన్ డాలర్ల గ్రాస్ దిశగా వెళ్ళిపోయింది. కేవలం ప్రీసేల్స్ ద్వారానే తొమ్మిది లక్షల డాలర్ల మార్క్ దాటడం గమనార్హం. ఇండియన్ సినిమాలలో ఇంత వేగంగా ఈ రికార్డు సాధించిన మొదటి సినిమా ఇదేనని చిత్ర బృందం చెబుతోంది.