రాజకీయ రంగుల మోజు.. లోకేష్ ఏం చేశారంటే?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రంగుల పిచ్చి ఎంత విపరీతంగా ఉండేదో రాష్ట్రప్రజలందరికీ తెలుసు. తాను కట్టించిన నిర్మాణాలు రాష్ట్రంలో లేకపోయినా, ఆల్రెడీ ఉన్న నిర్మాణాలకు తన పార్టీ రంగులు వేయడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి ఎంత వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారో ప్రజలు చూశారు. హైకోర్టులకు వెళ్లి కేసులు అయినప్పుడు.. తప్పనిసరి పరిస్థితుల్లో రంగులు మార్పించాల్సి వచ్చినప్పుడు.. ఆ ఖర్చుల రూపేణా ఎన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో కూడా ప్రజలు గమనించారు. అలాంటిది ఇప్పుడు.. కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రంగుల మోజు విషక్ష్ంలో కనబరుస్తున్న ఔదార్యం, ప్రాక్టికల్, నిష్పాక్షిక ధోరణిని చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. తమ ఆదేశాలేమీ లేకుండానే పసుపు రంగును ఉపయోగించినప్పటికీ కూడా.. ఆ రంగును మార్చి వేరే రంగులు వేయాలంటూ.. పార్టీని సూచించే రంగులు వద్దంటూ లోకేష్ పురమాయించడం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.
వివరాల్లోకి వెళితే..

వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం సీకెదిన్నె హైస్కూలులో ఆధునాతన అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. కిచెన్ తో పాటు, సమీప పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తరలించే వాహనాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా వాహనాలకు పసుపు రంగు థీమ్ వాడి పెయింటింగ్ చేయించి ఉండడాన్ని లోకేష్ గమనించారు. వెంటనే ఆ రంగును మార్చాలంటూ కలెక్టరుకు సూచించారు. వాహనాలకు పసుపురంగు కాకుండా.. స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ యొక్క కలర్ కోడ్ అయిన గ్రీన్ బ్రౌన్, రెడ్ కలర్స్ వాడాలంటూ లోకేష్ సూచించడం విశేషం. విద్యారంగాన్ని రాజకీయాలకు, రాజకీయ రంగులకు దూరంగా ఉంచాలని లోకేష్ కలెక్టరుకు సూచించారు.

లోకేష్ బుద్ధిని గమనించి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో రంగుల పిచ్చి విపరీతంగా ఉండేది. రేషన్ వాహనాలకు, అన్ని ప్రభుత్వ భవనాలకు, వార్డు సచివాలయ భవనాలకు అన్నింటికీ.. విచ్చలవిడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులను వినియోగించారు. ఆ తర్వాత ఆ రంగులపై హైకోర్టులో కేసులు నమోదు అయ్యాయి. కోర్టు ఉత్తర్వులతో మళ్లీ అన్నింటికీ రంగులు మార్పించారు. ఇలా ఒక్కో పని రెండేసి సార్లు చేడయం వల్ల, జగన్ రంగుల పిచ్చి వల్ల, కొన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయింది. జగన్ రంగులు, పేర్లు, తన బొమ్మను శాశ్వతంగా చేసుకోవాలనే పిచ్చి మోజులో రకరకాల అనుచిత నిర్ణయాలు తీసుకుని, కోర్టు నిర్ణయాలతో భంగపడిన సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది.. నారా లోకేష్ చెప్పకుండానే తమ పార్టీ రంగులు వేసినప్పటికీ.. వాటిని తొలగించాలని ఆదేశించడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories