కొత్త జంట పెద్ద పండుగ!

అక్కినేని వారి ఇంట గతేడాది చివరిలో ఎన్నో వేడుకలు జరిగాయి. వాటిలో చైతూ,శోభిత వివాహం కూడా ఒకటి.  ఇరు కుటుంబాల మధ్య వీరి పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట  బయట చాలా తక్కువగా కనపడుతున్నారు. కాగా ఈ ఇద్దరు  పెళ్లి తర్వాత తొలి సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకున్నారు.

 ఈ పండుగను వారు సంప్రదాయ ప్రకారం జరుపుకున్నట్లు తెలుస్తోంది. ట్రెడీషినల్ వేర్‌లో చైతూ, శోభిత ఇద్దరు కూడా చాలా చక్కగా కనపడ్డారు. దీనికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారింది.

శోభిత తో పాటు చైతూ కూడా చాలా సంతోషంగా కనిపిస్తున్న ఈ ఫోటో చూసి అభిమానులు పలు ఆసక్తికర  కామెంట్లు చేస్తున్నారు. ఈ జంట చూడచక్కగా ఉందంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories