శ్రీవాణి దోపిడీకి చెక్ పెట్టనున్న కొత్త బోర్డు!

జగన్మోహన్ రెడ్డి పాలన మొదలైన తర్వాత.. తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి ముసుగులో కూడా విచ్లచవిడిగా దండుకోవడానికి అనేక కొత్త కొత్త మార్గాలను కనిపెట్టారు. జగన్ 2019లో అధికారంలోకి వచ్చీరాగానే.. బోర్డు సంగతి దేవుడెరుగు అన్నట్టుగా ముందు తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని ఛైర్మన్ గా నియమించేశారు. బోర్డు నిదానంగా వేయచ్చుగానీ.. ఈలోగా అక్కడ దోచుకోగల మార్గాలు స్టడీచేయాలని సంకేతాలు ఇచ్చినట్టుగా ఆ నియామకం జరిగింది. దానికి తగ్గట్టుగానే.. వైవీసుబ్బారెడ్డి తన జమానా మొదలుకాగానే తీసుకున్న అనేకానేక నిర్ణయాల్లో శ్రీవాణి టికెట్ కూడా ఒకటి. పైకి చక్కగా కనిపిస్తూ దోపిడీకి రాచమార్గంగా ఉండే ఏర్పాటు ఇది.
శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయల విరాళం ఇచ్చిన వారికి రూ.500 వీఐపీ బ్రేక్ టికెట్ ను విక్రయిస్తారు. అయితే శ్రీవాణి ట్రస్టు దేశవ్యాప్తంగా తిరుమలేశుని ఆలయాలను వాడవాడలా నిర్మించడానికి మాత్రమే ఆ నిధులను ఖర్చు పెడుతుంది. ఒకవైపు వీఐపీ టికెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. మరొకవైపు వీఐపీ కోరుకునే వారికి అధిక ధరలకు  ఇస్తే తప్పేంటి అనే వాదన వచ్చింది. అది నిజమే అనుకున్నప్పటికీ.. టీటీడీలో ఏ పథకానికి భూరివిరాళం ఇచ్చినా ఇలా దర్శనం ఏర్పాటు చేయవచ్చు గానీ..కేవలం శ్రీవాణికి ఇస్తే మాత్రమే వీఐపీ టికెట్లు ఇస్తామనడం పెద్ద మాయగా మారింది.

శ్రీవాణి పేరిట వసూలైన సొమ్ములకు రసీదులుఇవ్వకపోవడం కోట్లరూపాయలు స్వాహా చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. మొత్తానికి కేవలం స్వామి వారి దర్శనాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేసే వ్యవస్థగా అది తయారైంది. ఇప్పుడు పాలకమండలి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన బిఆర్ నాయుడు.. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తాం అని అంటున్నారు. ఈ ఆలోచన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

కేవలం శ్రీవాణి ట్రస్టు రూపేణా జరిగే దోపిడీకి ఈ రకంగా బిఆర్ నాయుడు అడ్డుకట్ట వేయబోతున్నారు. దీని బదులుగా నిజంగా టీటీడీకి భూరి విరాళాలు ఇచ్చే భక్తులకు వీఐపీ దర్శనాలు ఇచ్చేలా ఇతర ప్రత్యామ్నాయ మంచి మార్గాలను అన్వేషించాలని భక్తులు కోరుకుంటున్నారు. శ్రీవాణి మాత్రమే కాకుండా.. సకల రీతులుగా భ్రష్టు పట్టిన టీటీడీ పరిపాలనను గాడిలో పెట్టాలని అభిలషిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories