అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన తరువాత సినిమాను డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో తీర్చిదిద్దేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను గతంలోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఈ సినిమాకు సంబంధించిన రీసెర్చ్, దాని కోసం వారు పడ్డ కష్టం, ఇక సినిమా కోసం వారు రెడీ అవుతున్న తీరు ను ప్రెజెంట్ చేస్తూ ఓ ప్రీ-ప్రొడక్షన్ వీడియోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. మిస్టిక్ థ్రిల్లర్గా రానున్న ఈ సినిమా కోసం అందరూ సిద్ధమయ్యారని ఈ వీడియో ద్వారా తెలిపారు.
ఇక ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ను కేటాయించారు. ఈ సినిమాలో చైతూ సరికొత్త లుక్తో అడ్వెంచర్ చేయబోతున్నాడని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి.