నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ వేసవి కానుకగా మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను నాని తన భుజాలపై వేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఇతర భాషల్లోనూ హిట్-3 ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇక మే 1న తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘రెట్రో’ మూవీ కూడా రిలీజ్ కానుంది.
‘కంగువా’ డిజాస్టర్ తర్వాత సూర్య నుంచి వస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం అనుకున్నంత స్పీడ్‌గా చేయలేకపోతున్నారు. తమిళ్‌లో పర్వాలేదు గాని.. తెలుగులో ఈ చిత్ర ప్రమోషన్స్ పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో ఈ సినిమాకు ఇక్కడ ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక రెట్రో సినిమాను తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం విశేషం. మరి ఈ సినిమాపై తెలుగులో సాలిడ్ బజ్ క్రియేట్ చేయాలంటే మేకర్స్ మరింత గ్రాండ్ ప్రమోషన్స్ చేయాల్సిందే.