మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది.
ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై సానుకూల బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని తొలి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మీసాల పిల్ల అనే ఈ మెలోడీ సాంగ్‌లో చిరంజీవి తన ఎనర్జీతో, వింటేజ్ డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేశారు. నయనతార కూడా తన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటలో ఆకట్టుకుంది.
ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, భాస్కరభట్ల సాహిత్యం రాశారు. గాయకులు ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ గళాలు ఈ పాటకు అదనపు ఆకర్షణగా మారాయి. ముఖ్యంగా ఉదిత్ నారాయణ్ స్వరం మరోసారి చిరంజీవితో కలిసిన సందర్భం అభిమానుల్లో పాత జ్ఞాపకాలను మళ్లీ తెచ్చింది.