ఇండియన్‌ 2 కి పోటీగా ఆ సినిమా రంగంలోకి!

ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలు మరోసారి బాక్సాఫీస్‌ దగ్గర రివైన్‌ అయ్యిందని చెప్పుకోవచ్చు. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ ల కల్కి 2898 ఏడీ సినిమా దెబ్బకి పాన్‌ ఇండియా వైడ్ గా ప్రేక్షకులు సినిమా థియేటర్స్ లోకి తరలి వస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అవైటెడ్ గా ఉన్న మరో పాన్ ఇండియా చిత్రం ఏదన్నా ఉంది అంటే అది కల్కి విలన్ యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ నటించిన “ఇండియన్ 2” సినిమా అనే చెప్పుకోవచ్చు.

ఎన్నో ఏళ్ళు తర్వాత దర్శకుడు శంకర్ తో చేసిన అవైటెడ్ సీక్వెల్ సినిమా ఇది కాగా ఇప్పుడు వరకు అయితే ఈ సినిమాతో పోటీగా ఏ సినిమా కూడా వస్తున్నట్టుగా బయటకి టాక్‌ రాలేదు. కానీ లేటెస్ట్ గా కోలీవుడ్ మార్కెట్ లోనే ఈ భారీ చిత్రానికి ఓ చిన్న సినిమా పోటీగా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ సినిమా కూడా భారతీయుడు 2 రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.

మరి ఆ సినిమా “టీన్జ్” కాగా ఈ మూవీలో “యుగానికి ఒక్కడు” ఫేమ్ ప్రముఖ నటుడు పార్థిబన్ ముఖ్య పాత్రలో అలాగే దర్శకునిగా టీన్జ్ కి వర్క్ చేయగా ఈ సినిమాని ఇప్పుడు ఇండియన్ 2 తో పోటీగా ప్రకటించి అదే డేట్‌ ని ఫిక్స్ చేశారు. మరి అలాంటి సినిమాతో పోటీగా అంటే సాహసమే అని చెప్పుకోవాలి. అయితే టీన్జ్ మేకర్స్ కూడా తమ సినిమా విజయం మీద నమ్మకంగానే ఉన్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories