సూపర్ హీరో తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్, రితికా నాయక్ కీలక పాత్రల్లో నటిస్తున్న మిరాయ్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ప్రత్యేకంగా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరింత ఆసక్తిని పెంచింది..
ఈ క్రేజ్ ఐఎండీబీ ర్యాంకింగ్స్‌లో కూడా ప్రతిబింబించింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ సినిమాల లిస్ట్‌లో మిరాయ్ మొదటి స్థానాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఇతర పెద్ద సినిమాల కంటే 19 శాతం ఎక్కువ ఓట్లు సాధించడం ఈ చిత్రానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ట్రైలర్‌లో కనిపించినట్లుగా, పురాణాలు, చరిత్ర, యాక్షన్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త తరహా విజువల్ అనుభవాన్ని ఇవ్వబోతోందని చెప్పవచ్చు.