అల్లరి నరేష్ తాజాగా యాక్ట్ చేస్తున్న సినిమా ‘బచ్చల మల్లి’.ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌లు పాజిటివ్ వైబ్స్ ని అయితే క్రియేట్ చేశాయి. అయితే, తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం యాక్షన్ ప్యాక్డ్‌గా కట్ చేశారు మూవీ మేకర్స్.
అల్లరి నరేష్ ఈ సినిమాలో పూర్తిగా రఫ్ అండ్ రగడ్ లుక్‌లో కనిపించడంతో పాటు.. మొండితనం, మూర్ఖత్వం ఉన్న బచ్చల మల్లి పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ టీజర్‌లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ శాంపిల్ మాత్రమే అనేలా ఉంది. ఇక ఎమోషనల్‌గానూ ఈ సినిమాలో మంచి స్టఫ్ ఉంటుందని టీజర్ చూస్తే తెలుస్తుంది. యాక్షన్‌తో పాటు మంచి ప్రేమకథ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ టీజర్‌తో అల్లరి నరేష్ మరోసారి ‘బచ్చల మల్లి’గా అదరగొట్టేందుకు రెడీ అయ్యాడని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాలో అందాల భామ అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమాను సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు.