మెగాస్టార్ చిరంజీవి హీరోగా కంబ్యాక్ ఇచ్చిన తర్వాత అందుకున్న సాలిడ్ హిట్ సినిమాల్లో డైరెక్టర్ కే ఎస్ రవీంద్ర (కొల్లి బాబీ)తో చేసిన మూవీ “వాల్తేరు వీరయ్య” .మెగాస్టార్ రేంజ్ లాంగ్ రన్ ని అందుకొని భారీ లాభాలని కూడా ఈ చిత్రం అందుకోగా ఈ చిత్రాన్ని అందించిన దర్శకుడు కొల్లి బాబీకి మెగాస్టార్ లేటెస్ట్ గా ఓ సడెన్ సర్ప్రైజ్ ని అయితే అందించారు. సోషల్ మీడియాలో బాబీ మెగాస్టార్ తనకి ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ తో పోస్ట్ చేసాడు.
ఒక ఖరీదైన చేతి గడియారాన్ని చిరంజీవి గిఫ్ట్ ఇచ్చి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అలాగే మీ ఎంకరేజ్ మెంట్ మీ ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉండాలని ఆశిస్తున్నాను అన్నయ్య అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసి మెగాస్టార్ తో ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని బాబీ షేర్ చేసుకున్నారు. తాజాగా ఆ విజువల్స్ వైరల్ గా మారాయి. అయితే వాల్తేరు వీరయ్య తర్వాత మరో సినిమా వీరి కాంబోలో ఉంటుంది అని తాజాగానే ఆ టాక్ వినపడుతుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.