కైరా పాత్రలో మెరిసిన మలయాళ ముద్దుగుమ్మ..మీరు చూసేయండి!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ప్రభాస్‌ తాజాగా నటిస్తున్న చిత్రా కల్కి 2898 ఏడీ సినిమా ఒకటి. ఈ సినిమా మరో ఆరు రోజుల్లో ప్రేక్షకులను ఆలరించేందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం వారి పోస్టర్లను విడుదల చేస్తుంది.

ఇప్పటికే చిత్ర బృందం దీని ట్రైలర్ ని విడుదల చేయగా అదిరిపోయే విజువల్స్‌ తో ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో అమితాబ్‌, కమల్‌ వంటి స్టార్‌ నటులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఆలనాటి సీనియర్‌ నటి శోభన మరియమ్‌ పాత్రలో చేస్తున్నట్లు చిత్ర బృందం పోస్టర్‌ ని విడుదల చేసింది.

తాజాగా ఈ సినిమాలోని కైరా పాత్రలో మలయాళ స్టార్ హీరోయిన్‌ అన్నాబెన్‌ ని చిత్ర బృందం పరిచయం చేసింది. కైరా బుజ్జిని నడుపుతున్న పోస్టర్‌ ని మూవీ మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories