ఆ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న మేకర్స్‌!

ఆ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న మేకర్స్‌! లేటెస్ట్ గా హిందీ సినిమా దగ్గర వచ్చి సాలిడ్ టాక్ తో దూసుకెళ్తున్న అవైటెడ్ చిత్రమే “ఛావా”. వెర్సటైల్ హీరో విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా శంబాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియెన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ ని అందుకుంటుంది. అయితే ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయినప్పటికీ ఈ చిత్రం కోసం ఇతర భాషల వారు కూడా మాట్లాడుకుంటున్నారు. మెయిన్ గా మన తెలుగు ఆడియెన్స్ లో కూడా ఛావా ప్రస్తావన సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తోంది. దీనితో బాలీవుడ్ నుంచి చాలా మంది ఏవేవో సినిమాలు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు ఇలాంటి సినిమాలు కదా రిలీజ్ చెయ్యాలి అని వారు భావిస్తున్నారు. మరి మేకర్స్ మాత్రం ఇలాంటి సినిమా పెట్టుకొని మంచి ఛాన్స్ నే మిస్ అయ్యారని చెప్పొచ్చు.

Related Posts

Comments

spot_img

Recent Stories