వీరమల్లు మూవీ ట్రైలర్‌ పై తాజా సమాచారం ఏంటంటే..!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” ప్రస్తుతం మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రం అనౌన్స్ చేసిన సమయంలోనే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కారణం – ఇది పవన్ కెరీర్‌లో మొట్టమొదటి హిస్టారికల్ సినిమా కావడం, అలాగే క్రిష్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వం వహించడమూ.

అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఎట్టకేలకు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మళ్లీ ఒక్కసారిగా ఈ సినిమాపై బజ్ మొదలైంది.

ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్‌పై పడింది. ఎందుకంటే ఇదే సినిమా టోన్‌ను బయటికి తీసుకొచ్చే ప్రాముఖ్యత కలిగిన దశ. తాజా సమాచారం ప్రకారం, చిత్రబృందం ట్రైలర్ ఫైనల్ కట్‌ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అంటే ఈ వారం చివరలో కానీ లేదా వచ్చే వారం ప్రారంభంలో కానీ ట్రైలర్‌ని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ట్రైలర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు మరో స్థాయికి చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్సులు సినిమాపై మంచి ఆసక్తిని కలిగించాయి. ఇక ఈ ఫుల్ లెంగ్త్ ట్రైలర్ వస్తే మాత్రం వీరమల్లు ఎలాంటి విధ్వంసం చేయబోతున్నాడో స్పష్టమవుతుంది.

ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగబోతుండటంతో అభిమానులు ఇప్పటికే హైప్లోకి వెళ్లిపోయారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? అనే టాపిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories