పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో ఇప్పటికే లైనప్‌లో ఉన్న సినిమాల మధ్య ప్రత్యేకంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందనే విషయం ముందే బయటికి వచ్చింది. ప్రభాస్ కొత్త గెటప్‌లో, పవర్ఫుల్ కాప్‌గా కనిపించబోతున్నారని చెప్పడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో, ఎప్పుడు విడుదలవుతుందో అన్న కుతూహలం ప్రేక్షకులలో ఇంకా కొనసాగుతూనే ఉంది.
తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న అప్డేట్ మాత్రం అభిమానుల్లో మరింత క్రేజ్ పెంచింది. సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ ఎపిసోడ్లో ప్రభాస్‌తో పాటు ముఖ్య తారాగణం కూడా పాల్గొననుందని సమాచారం.
ఇంకా ఒక ఆసక్తికర విషయమేమిటంటే, సినిమాలో ప్రత్యేక పాత్ర కోసం ఒక ప్రముఖ తమిళ నటుడిని తీసుకోవాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. ఆ స్టార్ ఎవరు అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. హీరోయిన్గా త్రిప్తి దిమ్రి ఇప్పటికే ఫిక్స్ అయింది. సంగీతం విషయంలో హర్షవర్ధన్ రామేశ్వర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.