గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ సినిమా “పెద్ది” గురించి అందరికీ తెలిసిందే. దీనికి ముందు గేమ్ ఛేంజర్ లాంటి డిజప్పాయింట్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇలా రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అదరగొట్టగా ఇపుడు ఈ సినిమా గ్లింప్స్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది.
నిజానికి మొన్న చరణ్ పుట్టినరోజు నాడే గ్లింప్స్ కూడా రావాల్సి ఉంది కానీ ఈ గ్లింప్స్ కొన్ని పనులు పూర్తి కానీ నేపథ్యంలో ఆలస్యం అయ్యింది. ఇక ఈ అవైటెడ్ గ్లింప్స్ అయితే ఈ ఉగాది కానుకగా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. కానీ ఇది వచ్చినప్పటికీ అందులోనే సినిమా బిగ్ స్క్రీన్ రిలీజ్ డేట్ ఉంటుందా లేదా అనేది మాత్రం ప్రశ్నార్ధకంగా మారింది. రిలీజ్ డేట్ దాదాపు అందులో అనౌన్స్ చేయొచ్చట. మరి చూడాలి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.