తెలుగు మూవీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘వార్ 2’ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఈ కలయికపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ అంచనాలకు మరింత బలం చేకూర్చేలా సినిమాలోని కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి.
ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా స్టైలిష్‌గా ఉండనుందని సమాచారం. ప్రత్యేకంగా, ఆయనకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ భాగం సినిమాలో చాలా కీలకంగా ఉంటుందట. ఆ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ పూర్తి యాక్షన్‌తో సాగుతుందని తెలుస్తోంది. తారక్ లైవ్ లుక్‌కు, ఫ్లాష్‌బ్యాక్ లుక్‌కు చాలా తేడా ఉండేలా డిజైన్ చేశారట. ఈ రెండు గెటప్‌ల మధ్య స్పష్టమైన డిఫరెన్స్ ఉంటుందట. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చివర్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు, విజువల్‌గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. విజువల్ ప్రెజెంటేషన్ పరంగా ఈ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ‘వార్ 2’ పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ వాంటెడ్ మల్టీస్టారర్‌గా నిలిచింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోల కాంబినేషన్ సినిమాపై సినీ లవర్స్‌లో భారీ హైప్ ఏర్పడింది. ఇందులో ఎన్టీఆర్ చేస్తున్న పాత్ర ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఆయన పాత్రలో ఉండే మాస్ అప్పీల్‌తో పాటు, యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు కచ్చితంగా తృప్తినిచ్చేలా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.