ఆ ముగ్గురు అధికార్ల ఉద్యోగాలకే ముప్పు!

ముంబాయి నటి కాదంబరి జత్వానీ విషయంలో అతిగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారుల విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగానే ఉంది. తప్పు చేసినట్టుగా తేలితే ఎంతటి వారినైనా ఉపేక్షించరాదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ముగ్గురు అధికారులు పాత్ర తప్పుడు దారి తొక్కినదని నిరూపించడానికి పోలీసుల వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, కేవలం వైసీపీ నాయకులతో లాలూచీ పడడం వల్ల మాత్రమే కాదంబరి విషయంలో అంత అతి చేశారని నిరూపించే ఆధారాలు కూడా అధికారుల వద్ద ఉన్నాయని.. ఈ నేపథ్యంలో.. వారి మీద తీవ్ర చర్యలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు.

కేవలం కుక్కల విద్యాసాగర్ కోసమే ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు స్థాయిలో జోక్యం చేసుకోవడం, కాంతిరాణా తాతా స్వయంగా పూనుకోవడం, విశాల్ గున్నీ ని నేరుగా పంపడం ఇవన్నీ అంత సులువు కాదని పలువురు భావిస్తున్నారు. వైసీపీ పెద్ద తలకాయలు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాయనేది అందరి అనుమానం. ఒక దినపత్రిక సజ్జల రామక్రిష్ణారెడ్డి మీద అనుమానాలు వచ్చేలా కథనాలు రాసింది. అదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల.. ఏకంగా అన్నయ్య నజగన్మోహన్ రెడ్డి మీదనే అనుమానాలు కలిగేలాగా.. సజ్జన్ జిందాల్ తో జగన్ కు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ కేసు వ్యవహారంతో ముడిపెట్టారు.

పాత్రధారులైన ముగ్గురు ఐపీఎస్ అధికారులు విధినిర్వహణలో గీత దాటి వ్యవహరించారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే.. వారిమీద విచారణ ప్రారంభం అయితే.. అది కేవలం సస్పెన్షన్లతో ఆగకపోవచ్చునని, ఏకంగా వారిని సర్వీసు నుంచి డిస్ మిస్ చేయవచ్చునని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి.
అయితే ఈ ముగ్గురు అధికారులూ లేదా ముగ్గురిలో ఎవరో ఒకరు.. తమను ఈ పనికి పురమాయించిన.. తెరవెనుక సూత్రధారులు ఎవరో విచారణలో వెల్లడించేస్తే కేసు పురోగతి ఇంకో మలుపు తిరగవచ్చు. వారి నోటి ద్వారా వాస్తవాలు వెల్లడైతే.. అప్పుడు వారిమీద తీసుకునే చర్యల్లో కూడా మార్పు ఉండొచ్చు. అప్పుడు మళ్లీ కొందరికి కొత్తగా అరదండాలు పడతాయి అని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories