జాక్‌ ఫ్రాంచైజ్‌ ..ఇన్ని సినిమాలా!

టాలీవుడ్  యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ ఓ హీరో. మరి సిద్ధూ హీరోగా టిల్లు సిరీస్ నుంచి చేస్తున్న మోస్ట్‌ అవైటెడ్ మూవీ ‘జాక్’. ప్రముఖ దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం లేటెస్ట్ ట్రైలర్ తో కూడా అలరించింది. అయితే టిల్లు సిరీస్ లానే ఈ సిరీస్ ని కూడా భాగాలుగానే తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈ సినిమాని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలుగా తీసుకొస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి ఈ మూడు సినిమా టైటిల్స్ కూడా రివీల్‌  చేశారు. ఫస్ట్ పార్ట్ జాక్. రెండో పార్ట్ ని “జాక్ ప్రో” అలాగే మూడో పార్ట్ కి “జాక్ ప్రో మ్యాక్స్” అంటూ వివరించారు. దీనితో కొత్త ఐఫోన్ లాంచ్ లో అనౌన్స్ చేసినట్టుగా రివీల్ చేయడం మంచి ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. మరి ఈ క్రేజీ ఫ్రాంచైజ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories