అనుష్క శెట్టి హీరోయిన్గా నటించిన తాజా యాక్షన్ డ్రామా సినిమా ‘ఘాటి’ విడుదలకు సిద్ధమైంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి ఇప్పటికే వచ్చిన ట్రైలర్, పాటలు మంచి హైప్ క్రియేట్ చేశాయి.
ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. కేజీయఫ్ స్టార్ యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ తన సొంతంగా ప్రారంభించిన పి.ఎ. ఫిల్మ్స్ అనే కొత్త డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఆమె పంపిణీ చేయబోయే తొలి సినిమా ఇదే కావడం ప్రత్యేకంగా మారింది.
అనుష్క చేసిన శక్తివంతమైన నటన, ప్రమోషనల్ వీడియోల్లో కనిపించిన విజువల్స్ చూసి పుష్ప ఎంతో ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది.