ఆ డైరెక్టర్‌ పై హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నవీనా బోలే కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ చాలా బోల్డ్ కామెంట్లు చేసింది. ఇంతకీ, నవీనా బోలే ఏం చెప్పింది అంటే.. ఆమె మాటల్లోనే.. ‘2004-05 సమయంలో ఓ ప్రాజెక్ట్ మీటింగ్ కోసం బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్‌ ను కలిశాను. అక్కడికి వెళ్లాకే అతడు ఎలాంటివాడో తెలిసింది. బట్టలు విప్పి కూర్చోమన్నాడు. నేను షాక్ అయ్యాను’ అని నవీనా పేర్కొంది.

ఈ విషయం పై నవీనా బోలే ఇంకా మాట్లాడుతూ..’ఎందుకు దుస్తులు తీయాలి ? అని అడిగితే.. దుస్తులు లేకుండా నా బాడీ ఎంత కంఫర్టబుల్‌గా ఉంటుందో చూడాలన్నాడు. వెంటనే నా ఫ్రెండ్ వెయిట్‌ చేస్తుందని  చెప్పి బయటకు వచ్చేశా. ఆ తర్వాత ఆయన పలుసార్లు కాల్స్ చేసినా నేను స్పందించలేదు.

ఇది అప్పట్లో నన్ను ఎంతో బాధించింది. మరో డైరెక్టర్‌ కూడా నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు’ అని నవీనా  తెలిపింది. మొత్తానికి ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్ ఎక్కువ అంటూ నవీనా  చెప్పింది.

Related Posts

Comments

spot_img

Recent Stories