దక్షిణాది సినిమా దగ్గర హీరోయిన్స్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ మంచి ఫేమ్ ని అందుకున్న పలువురు స్టార్ హీరోయిన్స్ లో సోలోగా కూడా మంచి ఆదరణ సహా మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో లేదు సూపర్ స్టార్ గా పిలవబడే కోలీవుడ్ నటి నయనతార కూడా ఒకరు.
అయితే నయనతారని కోలీవుడ్ ఆడియెన్స్ హీరోస్ లో రజినీకాంత్ ని సూపర్ స్టార్ గా పిలుచుకుంటే హీరోయిన్స్ లో ఆ రేంజ్ ట్యాగ్ ని నయనతారకి ఇచ్చి లేడీ సూపర్ స్టార్ గా ఇన్నేళ్లు పిలుచుకున్నారు. అయితే ఇపుడు ఈ ట్యాగ్ ని తాను వద్దు అనుకుంటున్నట్టుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది.
ఇటీవల పలు కాంట్రవర్సీలు నయన్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇపుడు తన సినిమా ట్యాగ్ ని రద్దు చేసుకొని కేవలం తనని నయనతార అనే పిలవాలి అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం నయన్ పలు తమిళ చిత్రాల్లో నటిస్తుంది.