హృదయం లోపల వచ్చేసింది!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న  తాజా సినిమా కింగ్డమ్.  ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

అయితే, తాజాగా ఈ మూవీ నుంచి ‘హృదయం లోపల’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఆద్యంతం మెలోడి కంపోజిషన్‌తో అనిరుధ్ తనదైన బీట్స్ అందించి ఆసక్తికరంగా మలిచాడు. ఇక ఈ పాటను ఆయనతో పాటు అనుమిత నాదేశన్ ఆలపించారు. ఈ పాటలో విజయ్‌తో పాటు అందాల భామ భాగ్యశ్రీ బొర్సె కూడా సాలిడ్‌గా కనిపించింది.

ఈ సినిమాను వేసవి కానుకగా మే 30న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories