మహా ప్రతిపక్షం.. జగన్ కంటే ముదురు రాజకీయం!

మహారాష్ట్రలో ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పడింది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఏక్ నాధ్ శిండే, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రులుగా ప్రభుత్వం కొలువుతీరింది. ప్రస్తుతం శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ప్రొటెం స్పీకరు నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రమాణాలు చేస్తున్నారు. అయితే.. ఇక్క్డడో ట్విస్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ప్రతిపక్షం మహా వికాస్ ఆఘాడీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ఉద్ధవ్ కు చెందిన శివసేన పార్టీ నాయకుడు ఆదిత్య ఠాక్రే ఈ విషయం ప్రకటిస్తూ.. ఈవీఎంలపై అనుమానాలున్నాయి. అందుకు నిరసనగా నేడు ప్రమాణ స్వీకారం చేయడం లేదు.. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటూ ఆదిత్య ఠాక్రే సెలవిచ్చారు. ఇదేదో.. తనను ముఖ్యమంత్రితో సమానమైన ప్రాధాన్యంతో ఎమ్మెల్యేగా ప్రమాణానికి పిలవలేదని.. అలిగి సభనుంచి వెళ్లిపోయిన జగన్మోహన్ రెడ్డి తీరులాగా ఉన్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. మహారాష్ట్రలో ప్రతిపక్షం వారి రాజకీయం.. జగన్ కంటె ముదురు రాజకీయంగా కనిపిస్తున్నదని నవ్వుకుంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చవకబారు ఎత్తుగడలతోనే రాష్ట్ర ప్రజల్లో చులకన అవుతున్నారనే సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రజలు అత్యంత స్పష్టమైన తీర్పుతో.. ఆయనను కేవలం 11 మంది ఎమ్మెల్యేల బలమున్న పార్టీ నేతగా ఇంట్లో కూర్చోబెట్టారు. మంత్రులతో సమానమైన గౌరవం ఆశిస్తూ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చి, అది పూర్తికాగానే ఆ గౌరవం దక్కలేదని అలిగి వెళ్లిపోయారు. అప్పటినుంచి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు గనుక.. నేను అసెంబ్లీకి రాను అని పట్టుపట్టి కూర్చొన్నారు. అసెంబ్లీ రోజుల్లో కూడా తాడేపల్లి ప్యాలెస్ కు, యలహంక ప్యాలెస్ కు మధ్య ప్రత్యేక విమానాన్ని టోకుగా మాట్లాడుకున్నట్టుగా తిరుగుతూనే గడుపుతున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయిన ఉద్ధవ్ వర్గం శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే దూకుడు చూస్తే.. జగన్ కంటె ముదురు అనిపిస్తోంది.వారు అసలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్నే బాయ్ కాట్ చేస్తారట. ఈవీఎంలలో మోసాలు జరిగాయని అనుమానం ఉన్నదిట. ఇంకా నయం.. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్లీ పోటీచేస్తాం.. అని అనడం లేదు. అయినా ఈరోజును బాయ్ కాట్ చేసారు గానీ.. రెండోరోజు వచ్చి ప్రమాణం చేస్తార్లే.. ఎమ్మెల్యేగా హోదా వదులుకోలేరు కదా..అని జనం అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories