ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ముందునుంచి ఉన్నదే. కానీ.. ప్రజా సంక్షేమం అంటే వారికి అప్పుడప్పడుూ కాసిని డబ్బులు ఇచ్చేసి, వారిని ఓటు బ్యాంకు గా తయారు చేసుకోవడం మాత్రమే అని భావించిన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటికి కనిపించని పథకం ఇది. పేదల జీవితాల్లో, ప్రత్యేకించి మహిళల జీవితాల్లో గుణాత్మక మార్పునకు, స్వావలంబనకు, సాధికారతకు కారణం కాగల ఆలోచనల మీద ఆయనకు శ్రద్ధ లేదు. అందుకే ఆయన పొరుగు రాష్ట్రాల్లో ఉన్నా కూడా దీని గురించి పట్టించుకోలేదు. కానీ.. పేదల జీవితాల్లోని మూలాల్లోనే వికాసం కనిపించాలని కోరుకునే దార్శనిక నాయకుడు చంద్రబాబునాయుడు.. తన ఎన్నికల మేనిఫెస్టోలో మహఇలలకు ఉచిత బస్సుప్రయాణం పథకాన్ని ప్రకటించారు. అది ఇవాళ్టి నుంచి అమలులోకి రాబోతోంది.
ఏపీఎస్ ఆర్టీసీ లో దాదాపు ఎనిమిదిన్నర వేల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తించేలా.. కూటమి సర్కారు స్త్రీశక్తి పథకాన్ని స్వాతంత్ర్య దినోత్సవం నాటినుంచి కార్యరూపంలోకి తెస్తోంది. తొలుత చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళల సొంత జిల్లాకు మాత్రమే ఉచిత ప్రయాణం పరిమితం అని ప్రకటించినప్పటికీ.. సుదీర్ఘమైన కసరత్తు తర్వాత.. రాష్ట్రమంతా ఉచిత ప్రయాణాలు వర్తించేలా విధివిధానాలు రూపొందించారు.
ప్రధానంగా నిరు పేదలు, గ్రామీణ మహిళలు.. తమకు సమీపంలోని ఇతర ప్రాంతాలకు రోజూ వెళ్లివస్తూ నికరాదాయం గల ఉపాధి, ఉద్యోగ పనులు పొందడానికి, చిరు ఆదాయాలతో జీవితాల్ని మెరుగుపరచుకోవడానికి ఈ పథకాన్ని ఉద్దేశించారు. ఆ దిశగా మహిళా సాధికారతకు ఇది పునాది వేస్తుందని కూడా అనుకుంటున్నారు. అదే సమయంలో.. బస్సు ప్రయాణం ఉచితం కదా అని.. సంపన్న వర్గాల మహిళలంత సరదాగా విహారయాత్రలు లాంటి వాటి పేరుతో ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటును వృథా చేయకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఈ ఉచిత ప్రయాణాన్ని ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ లాంటి అయిదు రకాల బస్సులలో మాత్రమే అనుమతిస్తున్నారు. డీలక్స్, సూపర్ లగ్జరీ వంటి బస్సులలో ఉచితం వర్తించదు. కుప్పంనుంచి సింహాచలం వెళ్లాలనుకున్నా మహిళలకు ఉచితమే గానీ.. వారు కేవలం ఎక్స్ ప్రెస్ బస్సులను మాత్రమే ఆశ్రయించి వెళ్లాల్సి ఉంటుంది.
అయితే ప్రభుత్వం చేసే ప్రతి మంచి పని మీద కూడా విషం కక్కడానికి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉండే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్త్రీశక్తి పథకం మీద కూడా అదే పనిచేస్తోంది. డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా ఉచిత అవకాశం కల్పించడం లేదంటూ.. దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు. మహిళలలో అపోహలు కలిగిస్తున్నారు. ఒకజిల్లాకు మాత్రమే ఉచితం అని చెప్పిన చంద్రబాబు.. రాష్ట్రానికి మొత్తం వర్తించేలా పథకం అమలు చేయడమే చాలా గొప్ప అని మహిళలో మాత్రం హర్సాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.