వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ, ఆయన భట్రాజు గణాలు గానీ, సాక్షి పత్రిక, టీవీ ఛానెల్ దళాలు గానీ.. రెండు రోజులుగా పాడుతున్న పాట ఒక్కటే. ‘వైఎస్ జగన్ అంటే ప్రభుత్వానికి ఎందుకంత భయం’ అనేది మాత్రమే. జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధిస్తోంటే.. అక్కడికేదో పోలీసులు జగన్ మోహన్ రెడ్డిని చూసి వణికిపోతున్నట్టుగా.. ప్ర;భుత్వం జడుసుకుంటున్నట్టుగా.. నీలిదళాలు ఇలాంటి ప్రచారాల్ని సాగిస్తున్నాయి. సంచలనం చేయడమూ శాంతి భద్రతలను భగ్నం చేయడమే లక్ష్యంగా ప్రవర్తించే వైసీపీ నాయకులు జనసమీకరణ జరిగి తీరుతుందని, వేల సంఖ్యలో జనం వచ్చి తీరుతారని.. ఎవరేం చేస్తారో చూస్తాం అని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఉద్రిక్తంగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రజలు మాత్రం.. జగన్ పర్యటన అంటే.. ప్రభుత్వానికి భయం ఉన్నమాట నిజమే అని అనుకుంటున్నారు. జగన్ తన నెల్లూరు పర్యటనలో తన కారు కింద తొక్కించి ఎందరి ప్రాణాలను బలితీసుకుంటారో అని ప్రభుత్వం, పోలీసులు భయపడుతుండవచ్చు.. అని జనం అనుకుంటున్నారుు.
రెంటపాళ్లలో మరణించిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నానని అనుమతి తీసుకుని.. డీజేలతో పెదపెద్ద సౌండ్ సిస్టమ్ లతో కిరాయి మూకల నృత్యాలతో కలిసి ఊరేగింపుగా వెళ్లిన వ్యక్తి జగన్.. తన కారు చక్రం కింద ఒక తలను తొక్కించి ఒక దళిత ప్రాణాన్ని బలితీసుకున్నారు. బంగారుపాళెం మామడి రైతుల పరామర్శకు వెళ్తానని చెప్పి.. ఏకంగా అయిదు ట్రాక్టర్ల మామిడికాయలను రోడ్డుపై కుమ్మరించేలా పార్టీవారితోనే చేయించి.. వాటిని తొక్కించుకుంటూ వెళ్లారు జగన్. జగన్ కు తలకాయలైనా మామిడికాయలైనా ఒకటేనని, తొక్కించుకుంటూ వెళ్లిపోతారని అప్పట్లో సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
ఇప్పుడు నెల్లూరు యాత్రకు వస్తానంటున్న జగన్.. ఇక్కడ తన కారు చక్రాల కింద ఎందరు మనుషుల తలకాయల్ని తొక్కించడం, ఎందర్ని బలిలీసుకోవడం లక్ష్యంగా పెట్టుకుని వస్తారో అని పోలీసులు భయపడడం సహజమే అని ప్రజలు అంటున్నారు. అందుకే జగన్ తొక్కించి చంపేస్తాడు గనుక.. ఎవ్వరినీ రావొద్దని ప్రజల ప్రాణాలను రక్షించే బాధ్యతతో హెచ్చరికలు జారీచేస్తుండవచ్చునని అంటున్నారు. జగన్ దళాలకు చేతనైతే.. ముందే తాము జనసమీకరణ కూడా చేస్తున్నామని పోలీసులకు చెప్పి అనుమతి తీసుకోవాలి. జనంతో రోడ్ షో కాకుండా.. చేతనైతే ఒక బహిరంగ సభ లాంటిది పెట్టుకోవాలి. అక్కడకు ఎంత మంది జనం వస్తారో కూడా లెక్కతేలిపోతుంది. ఆ సత్తా లేకుండా అల్లరి మూకల్ని కొందరిని పోగేసి.. వారితో కాన్వాయ్ సాగినంత దూరమూ రచ్చ చేయిస్తూ వెంటేసుకుని తిరిగి.. జగన్ అంటే జనం వెల్లువలా వచ్చేస్తున్నారు.. ఆ జనాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోంది అని చాటుకోవడం చవకబారుతనం అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.