మధురము కదా” అంటూ వచ్చేస్తున్న ఫ్యామిలీ స్టార్‌!

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కథనాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్‌. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి సోమవారం మరో సింగిల్‌ సాంగ్‌ ను విడుదల చేయబోతున్నారు. మధురము కదా.. అంటూ సాగే ఈ పాటను హోలీ సందర్భంగా ప్రేక్షకులకు అందించనుంది చిత్ర బృందం.

దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది. అందులో విజయ్‌ క్లాసీ లుక్‌ లో ఆఫీస్‌ బిల్డింగ్‌ ముందు కూర్చుని హీరోయిన్‌ తో మాట్లాడుతున్నట్లు ఉంది. మధురము కదా పాట ప్రేమ గీతంగా తెలుస్తుంది. ఈ పాటను గాయని శ్రేయా ఘోషల్‌ పాడారు. దీనికి శ్రీమణి లిరిక్స్‌ ఇచ్చారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి నందనందనా.. , కల్యాణి వచ్చా వచ్చా పాటలు విడుదల అయ్యి సూపర్‌ హిట్‌ అయ్యాయి. దీంతో ఈ మూడో పాట గురించి కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. గురువారం సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories