మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలవగా.. ఎన్టీఆర్ తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు.
కర్ణాటకలోని మంగళూరులో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన పోర్ట్ సెట్‌లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇందులో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ నాలుగు రోజుల పాటు జరగనుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.